ఏపీకి టోపీ..! పెట్టిందెవ‌రు.. ఆంధ్ర‌జ్యోతి ఆస‌క్తికర‌ క‌థ‌నం

అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుంద‌ని నిత్యం ఊదర‌గొట్టే ఆంధ్ర‌జ్యోతి ఇవాళ ఓ ఆసక్తిక‌ర క‌థ‌నం ప్ర‌చురించింది. నిధుల విషయంలో కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోంద‌ని.. అభివృద్ధిలో ఏపీ వెనుక‌బ‌డిపోయింద‌ని పేర్కొంది. దేశంలో ఏపీ దూసుకుపోతుంద‌ని సీఎం చంద్ర‌బాబునాయుడు చెప్పిన‌ప్పుడు.. అది నిజ‌మ‌నే స్థాయిలో క‌వ‌రింగ్ ఇచ్చిన ఆ పత్రిక.. ఇప్పుడు అభివృద్ధి లేద‌ని చెప్ప‌డం వెనుక మ‌ర్మ‌మేంటో..!
‘దేశ జనాభాలో మన రాష్ట్ర వాటా ఐదు శాతం. తలసరి ఆదాయం తక్కువే. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో మనమే అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం. ఇలా ఏ లెక్కన చూసుకున్నా… రాష్ట్రానికి సముచిత స్థాయిలో కేంద్ర నిధులు రావాలి. కానీ… కేంద్రం మనకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడంలేదు. ప్రస్తుతం కేంద్రం 44 పథకాలను అమలు చేస్తోంది. అందులో 24 పథకాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఎనిమిది పథకాల్లో ఏపీకి నిధుల విడుదల దాదాపు సున్నా. మరో 16 పథకాల్లో అంతంత మాత్రమే! మిగిలిన 20 పథకాల కింద ఫర్వాలేదు అనే స్థాయిలో నిధులు అందుతున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో రూ.78,914 కోట్లు విడుదల చేయగా… అందులో రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1880కోట్లు. అంటే… 2.38% మాత్రమే!
ఏపీకి సున్నా… ఆ రాష్ట్రాలకు మిన్న
దక్షిణాది రాష్ట్రాలు పన్నులు కట్టేందుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు కేటాయింపుల కోసం ఉన్నాయనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. మౌలిక సౌకర్యాలు, ప్రజలకు ఆర్థిక సాయం, అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు ఉద్దేశించిన కేంద్ర పథకాల నుంచి అవసరమైన సాయం ఏపీకి అందడం లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన నుంచి స్మార్ట్‌ సిటీస్‌ వరకు ఎందులో చూసినా ఏపీపై చిన్నచూపే. ప్రఽధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ) కింద ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో కేంద్రం 18,602 కోట్లు విడుదల చేసింది. ఇందులో… మన రాష్ట్రానికి దక్కింది కేవలం రూ.71కోట్లు. అంటే… 0.4 శాతమే! అదే… మధ్యప్రదేశ్‌కు ఏకంగా 25 శాతం, రాజస్థాన్‌కు 10 శాతం నిధులు ఇచ్చారు.
సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌… రాష్ట్ర కేటాయింపు పనుల కోసం 3307కోట్లు విడుదల చేయగా… నవ్యాంధ్రకు పైసా దక్కలేదు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం పెట్టిన ‘అమృత్‌’ పథకం కింద 2,766 కోట్లు విడుదల చేయగా… ఏపీకి 113 కోట్లు(4శాతం) దక్కాయి. కానీ… ఉత్తరప్రదేశ్‌కు 500కోట్లు(18శాతం), మహారాష్ట్రకు 415 కోట్లు (15శాతం) విడుదల చేశారు. ఆరోగ్యం, వైద్య విద్యలో మానవ వనరుల పథకం కింద 2597 కోట్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద రూ.2,348కోట్లు, ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన కింద రూ.1055 కోట్లు, మత్స్య రంగ సమగ్ర అభివృద్ధి కోసం రూ.112 కోట్లు విడుదల చేయగా… వీటిలో రాష్ట్రానికి అందిన నిధులు దాదాపు సున్నా..! అంటూ కథ‌నాన్ని ఇవ్వడం విశేషం.

మ‌రీ ఈ క‌థ‌నాన్ని చ‌దివి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి బృందం, కొంత మంది భ‌జ‌న రాయుళ్లు అభివృద్ధిపై ఊదరగొడుతున్నది అవాస్తవం అనుకోవాలా… ఇంత‌కు అభివృద్ధి ప్ర‌జ‌ల‌కు టోపీ పెడుతోంది ఎవ‌రు..? చ‌ంద్ర‌బాబు నాయుడా..? ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీనా..?

2 thoughts on “ఏపీకి టోపీ..! పెట్టిందెవ‌రు.. ఆంధ్ర‌జ్యోతి ఆస‌క్తికర‌ క‌థ‌నం

  1. Narasimhapodile

    - Edit

    Reply

    మాకు పచ్చకామెర్లు ఆబిన్ మనకు బీజేపి అన్యయం చేస్తుందని చెప్పినట్లు అనిపిస్తుంది అది ఎవరి వల్లో లోగుట్టు దేవుని దయ

Add Comment