పాద‌యాత్ర కేవ‌లం 120 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే-వైసీపీ ప్ర‌క‌ట‌న

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షత‌న బుధ‌వారం నాడు ఉద‌యం కీలక సమావేశం జ‌రిగింది. హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జ‌రిగిన ఈ భేటీలో నవంబర్‌ 2వ తేదీ నుంచి తలపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ జరిగింది.

 

న‌వంబ‌ర్ 2 న వైయ‌స్ జ‌గ‌న్ మొద‌లు పెట్ట‌నున్న పాద‌యాత్ర కేవ‌లం 120 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే జ‌రుగుతుంద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత, ఆ పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డి పేర్కోన్నారు. సుమారు మూడు వేల కిలోమీట‌ర్లు, ఆరు నెల‌ల‌పాటు జ‌ర‌గ‌నున్న ఈ పాద‌యాత్ర ఇడుపుల‌పాయ నుండి ఇచ్చాపురం వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

 

మిగ‌తా 55 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర చేపట్ట‌నున్న‌ట్లు ఎంపీ మేక‌పాటి మీడియాకు తెలియ‌జేశారు. చంద్ర‌బాబు క‌బంద హ‌స్తాల నుండి ప్రజాస్వాయ్యాన్ని కాపాడాల‌ని, ఒక్క‌సారి వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుప‌నిచ్చారు.

Add Comment