ఏపీ స‌చివాల‌యం ఎదుట యువతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం ఎదుట ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. వసుధ అనే యువతి బుధవారం సచివాలయం ప్రధాన గేటు ముందు యువతి కళ్లు తిరిగి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వసుధ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా విజయనగరం జిల్లాకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి వసుధను ప్రేమించి మోసం చేసినట్లు తెలిసింది. అయితే స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో ఆమె… త‌న బాధ‌ను నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది.

అయితే వసుధను స‌చివాల‌య సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలోనూ ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ కూడా తన స‌మ‌స్య‌ను చెప్పుకునేందుకు వ‌చ్చినా స్పందించ‌క‌పోవ‌డంతో సచివాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన విషయంతెలిసిందే.

Add Comment