వైసీపీ ఎమ్మెల్యే రోజాకు వ‌ర్మ బంప‌ర్ ఆఫ‌ర్

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే కాదు…తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా హాట్ టాపిక్ గా మారింది. సంచ‌లనాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ…. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై మ‌రో వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఈ చిత్రంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓ పాత్ర పోషిస్తారని దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మంగ‌ళ‌వారం నాడు చిత్తూరు జిల్లా పలమనేరులో రాంగోపాల్ వర్మ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆయ‌న అక్క‌డ మీడియాతో ముచ్చటించారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో ఇంకా ఎవ‌రినీ ఎంపిక చేయలేదనీ, ఐతే ఓ పాత్రలో మాత్రం వైసీపి ఎమ్మెల్యే రోజా నటిస్తారని ఆయ‌న చెప్పారు. కాగా రోజా నటించే పాత్ర అనగానే తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఎన్టీఆర్ జీవించి వుండగా జయప్రద చేరారు. మరి ఆమె పాత్రనేమైనా రోజా పోషిస్తారా అనే వార్తలు తెర‌పైకి వస్తున్నాయి.

Add Comment