భ‌క్తుల కోసం టీడీడీ మ‌రో కీలక నిర్ణ‌యం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుండి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలందించడానికి టీడీడీ స‌న్న‌ద‌మైంది. ప్రతి విభాగంలో మౌలికమైన మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

మంగళవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సీనియర్‌ అధికారులతో తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు సమీక్షా సమావేశం నిర్వహించ‌డం జ‌రిగింది. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ… రానున్న రోజుల్లో భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా వారికి విశేష సేవలు అందించేందుకు ప్రతి విభాగంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకుంటూ సన్నద్ధం కావలసిన అవసరాన్ని గుర్తుచేశారు.

శ్రీవారి పోటు విభాగంలో అదనపు స్థలం అన్వేషించవలసిన అవసరం ఉందని ఆయ‌న అన్నారు. తద్వారా ఎక్కువ లడ్డూలు తయారు చేసే విధంగా బూందిపోటులో ఉన్న అన్ని పొయ్యిలను ఆధునీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలను నిపుణుల నుండి తీసుకోవాలని సూచించారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లలో, వెలుపల క్యూలైన్లలో అన్న ప్రసాదాలు వృధా కాకుండా ప్రణాళికలు తయారుచేసి నివేదికలందించాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లలో ఉన్న ఫోన్‌లు నిరంతరం పనిచేసేందుకు అవసరమైన ఎలక్ట్రికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

Add Comment