పాద‌యాత్ర తేదీని మార్చేసిన జ‌గ‌న్ అనంత‌లో ప్ర‌క‌ట‌న

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌తంలో జ‌రిగిన ప్లీన‌రీ స‌మావేశంలో అక్టోబ‌ర్ 27 వ తేదీ నుండి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే కేసుల కార‌ణంగా వైయ‌స్ జ‌గ‌న్ నిర్వ‌హించ‌నున్న పాద‌యాత్ర‌పై అనేక వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

అయితే మంగ‌ళ‌వారం నాడు ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అనంత‌పురంలో నిర్వ‌హించిన యువ‌భేరీ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌పై క్లారిటీ ఇచ్చేశారు. న‌వంబ‌ర్ 2 వ తేదీ నుండి పాద‌యాత్ర చేస్తున్నాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు. అనంత లో వైయ‌స్ జ‌గ‌న్ నిర్వ‌హించిన యువ‌భేరి కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున విద్యార్ధులు, మేధావులు, ఉపాధ్యాయులు, జిల్లా వైసీపీ నేత‌లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ….పాద‌యాత్ర నిర్వ‌హిస్తూనే ప్ర‌త్యేక హొదా ఉద్య‌మాన్ని కూడా కొన‌సాగిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. అబ‌ద్ద‌పు హామీల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఎద్దేవ చేశారు.

న‌వంబ‌ర్ 2 వ తేదీన ప్రారంభం కానున్న పాద‌యాత్ర ఇడుపుల‌పాయ నుండి ఇచ్చాపురం వ‌ర‌కు సుమారు మూడు వేల కిలోమీట‌ర్లు కొన‌సాగుతుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. పాద‌యాత్ర‌లో ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుతామ‌ని ఆయ‌న అన్నారు.

Add Comment