ద‌మ్ముంటే నిరూపించండి – లోకేష్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ మ‌రోసారి ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై సీరియ‌స్ అయ్యారు. విశాఖ భూ కుంభకోణంలో తన పాత్ర ఉందని ఆరోపిస్తున్న వైసీపీ నేత‌లు ద‌మ్ముంటే నిరూపించాలని లోకేశ్ స‌వాల్ విసిరారు.

ప్రతిపక్ష వైకాపాకు నిరాధార‌ ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని లోకేశ్‌ అన్నారు. ఒకవేళ అలాంటి ఆధారాలుంటే భూకుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆ వివరాలను సమర్పించాలని ఆయ‌న పేర్కొన్నారు.

రాష్ట్రంలో గృహ నిర్మాణాల గురించి వైకాపా విమర్శలపై కూడా నారా లోకేశ్ స్పందించారు. లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు కూడా జరిగాయని ఆయ‌న గుర్తు చేశారు. ఏమైనా అనుమానాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలనకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని తెలిపారు.

Add Comment