షాకింగ్… జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టిన ఉండ‌వ‌ల్లి

 

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌ణ్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యాన్ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ త‌ప్పుబ‌ట్టారు. శుక్ర‌వారం రోజు ఉండ‌వ‌ల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌ర్క‌ర్ తీర‌ను త‌ప్పుబ‌డుతూ, మ‌రోవైపు వైసీపీకి ప‌లు స‌ల‌హాలు ఇచ్చారు.

 

త్వ‌ర‌లో ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే వైసీపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తూ ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో వైసీపీ తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు ఉండ‌వ‌ల్లి. అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించాల‌ని, అవిశ్వాసం తీర్మానం పెట్టాల‌ని అప్పుడు కూడా మాట విన‌క‌పోతే బైకాట్ చేయాల‌ని హిత‌వు ప‌లికారు.

అసెంబ్లీ స‌మావేశాల‌ను బై కాట్ చేయ‌డంపై మ‌రోసారి వైసీపీ పున‌రాలోచ‌న చేయాల‌ని ఆయ‌న కోరారు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఆత్మాహ‌త్యా య‌త్నం లాంటిద‌ని , అలాంటి ప‌ని చేయ‌వ‌ద్ద‌ని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు.

Add Comment