రేవంత్ ని వ్య‌తిరేకిస్తున్నానా….?

తెలంగాణ తెలుగు దేశం పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఆ పార్టీ ఉపాధ్య‌క్షులు రాహుల్ గాంధీ స‌మక్షంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ క‌ప్పుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిక‌ను ఆ పార్టీ సీనియ‌ర్ మ‌హిళా నేత, ఎమ్మెల్యే డికే అరుణ వ్య‌తిరేకిస్తున్న‌ట్లు వార్తలు తెర‌పైకి వ‌చ్చాయి. దీంతో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు డీకే అరుణ స్పందించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిని తాను ఎందుకు వ్యతిరేకిస్తానని డికె అరుణ ప్రశ్నించారు.

.రేవంత్ ను వద్దనవలసిన అవసరం తనకు ఏముందని ఆమె అన్నారు. వ్యతిరేకించేవారెవరైనా ఉంటే వారు నా పేరు చెబుతున్నారేమో అని అమె అన్నారు. అంతేకాకుండా రేవంత్ కు పదవులు ఇవ్వద్దని కూడా తాను చెప్పలేదని ఆమె అన్నారు. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్ధితుల నేప‌థ్యంలో కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తుందని నేను అనుకోవడం లేదని అరుణ వ్యాఖ్యానించారు.

Add Comment