మద్దతు కోసం వైఎస్‌ఆర్సీపీ ధర్నా

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న‌దైన శైలిలో మందుకు సాగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతున్నారు వైసీపీ నాయ‌కులు. ఈ క్ర‌మంలో వారు మ‌రో ప్ర‌జా స‌మ‌స్య పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.

తెలంగాణ‌లో కూడా ప్ర‌జా స‌మ‌స‌ల్య‌పై నిల‌దీస్తూ ముందుకు సాగుతోంది.  పత్తికి మద్దతు ధర ప్రకటించాలని కరీంనగర్‌ మార్కెట్ యార్డు వద్ద వైకాపా ఆందోళన చేపట్టింది. సోమవారం వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి మార్కెట్‌ యార్డును సందర్శించి, పత్తి కొనుగోళ్లను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. సీసీఐతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఇచ్చే రూ.4,000 ఇప్పటి నుంచే ఇవ్వాలని వారు కోరారు. ఈ విష‌యంపై ప్రభుత్వం స్పందించకుంటే పత్తి రైతుల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Add Comment