భ‌న్వ‌ర్‌లాల్‌కు ఐవీఆర్ మ‌ద్ద‌తు..!

ఏపీ ఎన్నికల ముఖ్య అధికారిగా రిటైరైన భ‌న్వర్‌లాల్‌కు మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్టారావు మ‌ద్ద‌తు ప‌లికారు. భ‌న్వర్‌లాల్‌పై ప్ర‌భుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయ‌న విమర్శించారు. ఈ విషయమై ఐవైఆర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారంటూ ఫిర్యాదులో వివ‌రించారు. భ‌న్వ‌ర్‌లాల్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేయ‌నందుకే ఆయ‌న‌పై క‌క్ష పెంచుకున్న‌ట్లు తెలుస్తోంద‌ని లేఖ‌లో వివ‌రించారు. రాష్ట్ర ప్రభుత్వం మోపిన అభియోగాలపై ఎన్నికల సంఘమే దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు.

Add Comment