ప‌వ‌న్ కొడుకు పేరు ఎలా ఉందో చెప్పండి

పేరులో నేముంది గ‌ర్వ‌కారణం అనుకోకుండా త‌న కుమారుడికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ బాగా ఆలోచించి స‌రికొత్త పేరు పెట్టాడు.
ప‌వ‌న్ భార్య అన్నా లెజినోవా ఇటీవ‌లె పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విషయం తెలిసిందే. ఆ చిన్నోడికి ప‌వ‌న్ మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ కొణిదెల‌ అని పేరు పెట్టారు. ఈ పేరుపై ఇపుడు ఇంట‌ర్నెట్‌లో పెద్ద ర‌చ్చే న‌డుస్తోంది. త‌న భార్య మ‌త సంప్ర‌దాయాల‌కు గౌర‌వ‌మిచ్చి ఈ పేరు పెట్టినట్లు తెలిసింది. ఆమె పాటించే రష్యన్‌ ఆర్థోడక్స్‌ మత సంప్రదాయాలకు అనుగుణంగానే పవన్‌ తన బిడ్డకు పేరు పెట్టారు. క్రైస్తవ మతంలో బాగా ప్రాచుర్యం పేరు ‘మార్క్‌’. మార్కస్‌ అనే దేవుడికి సంక్షిప్త నామంగా చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర్‌ వరప్రసాద్‌ నుంచి ‘శంకర్‌’ను తీసుకొన్నారు. పవన్‌ పేరును పవనోవిచ్‌ అని మార్చి… పూర్తిగా ‘మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌’ అని పెట్టారు.
పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజినోవాకు పుట్టిన కూతురు పేరు పొలెనా అని మాత్రమే తెలుసు. ఆమె పూర్తి పేరు పొలెనా అంజనా పవనోవా అంట. ఈ పేరు వెనుక కూడా ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. తన తల్లి అంజనాదేవి నుంచి ‘అంజన’ను తీసుకొని.. తన పేరులోని పవన్‌ను పవనోవాగా మార్చి ‘పొలెనా అంజనా పవనోవా’ అని పెట్టారు. నటనలోనే కాదు… పిల్లల పేర్లు పెట్టడంతో పవన్‌ వైవిధ్యం చూపిస్తున్నారన్నమాట..

Add Comment