పార్టీ మారిన ఎమ్మెల్యేలకు శ్రీకాంత్ రెడ్డి బంపర్ ఆఫర్..!!

 

క‌డ‌పలో జిల్లా ప‌రిష‌త్ స‌మావేశాలు ర‌సాభ‌సాగా మారాయి. అధికార పార్టీ నేత‌ల‌కు, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కు మ‌ధ్య మాట‌ల యుద్దం తారా స్దాయికి చేరుకుంది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో స‌మావేశం ర‌ణ‌రంగంగా మారింది. ఈ స‌మావేశంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు, వైకాపా ఎమ్మెల్యే బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు.

తనపై చేసిన అరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శ్రీకాంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ విషయమై ఇరువురు సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో జెడ్పీ చైర్మన్ రవి సమావేశాన్ని పది నిమిషాలు సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ స‌మావేశ‌లో పేద‌ల‌కు పైసా ఖ‌ర్చు లేకుండా ఇళ్లు నిర్మించాలంటూ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి డిమాండ్ చేశారు.

దీనిపై మంత్రి సోమి రెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స్పందిస్తూ…ఈ విష‌యంపై త్వ‌ర‌లో రానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించాలంటూ ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కు కోరారు. మ‌రోవైపు ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి, వైకాపా ఎమ్మెల్యేకి మ‌ధ్య కొన్ని నిమిషాల పాటు మాట‌ల యుద్దం నడిచింది.

Add Comment