నా పగ తీర్చుకుంటా- వర్మ

 

సంచ‌ల‌నాల డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏదీ చేసినా సంచ‌న‌ల‌మే. త్వరలో అక్కినేని నాగార్జునతో తీయ‌బోయే సీనిమాకు తన తల్లి సూర్యమ్మతో క్లాప్‌ కొట్టిస్తానని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అంటున్నారు. ఇందుకు కారణమేంటో ఆయన ఎప్ప‌టిలాగే త‌న ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

చిన్నప్పుడు తన తల్లి తనని ఎందుకూ పనికిరాడు అని అనుకునేవారట. అయితే ఇప్పుడు ఆయన ఓ సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు అయ్యారు కాబట్టి నాగ్‌ చిత్రానికి తన తల్లితో క్లాప్‌ కొట్టించి తన పగ తీర్చుకుంటానని చమత్కరించారు. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోలను రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు.

 

 

‘శివ’ సినిమా చిత్రీకరణ సమయంలో తన తండ్రి కృష్ణం రాజుతో క్లాప్ కొట్టించారు రాం గోపాల్ వర్మ. అప్పటి ఫొటోను కూడా వర్మ త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నేను దర్శకుడిని అవుతానంటే మా నాన్న నన్ను నమ్మలేదు. అందుకే ‘శివ’ సినిమాకి మా నాన్న చేతే క్లాప్‌ కొట్టించి పగ తీర్చుకున్నాను’ అని రాశారు.

నాగార్జున తో తీయబోయే సినిమా నవంబర్‌ 20 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలుకానుంది. ఈ సినిమాకి ఇంకా టైటిట్‌ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా టబు నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Add Comment