జ‌గ‌న్ పై ఏపీ మంత్రుల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు వాడీ వేడీగా కొన‌సాగుతున్నాయి. త‌ర‌చూ అధికార, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఏపీ మంత్రులు ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వచ్చే ఎన్నికలలో కూడా టిడిపినే గెలుస్తుందని, వైసిపి తపస్సు చేసినా గెలవలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. పులివెందులలో కూడా టిడిపినే గెలుస్తుందని ,మొత్తం 173 సీట్లు గెలుస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాల వల్ల మ‌రికొంత మంది వైసిపి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారేమో అన్న సందేహంతోనే జగన్ అసెంబ్లీ బహిష్కరణ చేయించారని వారు ఆరోపించారు.

 

పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే హక్కు, అర్హత లేదని, వైఎస్‌ చనిపోయినప్పుడు తనతో సహా 31 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా వైయ‌స్ జగన్‌ పార్టీలో చేరామ‌ని మంత్రి ఆది నారాయణరెడ్డి గుర్తు చేశారు. దీంతో ఫిరాయింపు మంత్రి ఆది చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ శ్రేణులు తీవ్ర స్ధాయిలో మండిప‌డుతున్నారు.

Add Comment