ర్యాంకులు రాని మంత్రుల‌కు సీటు క‌ష్ట‌మే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మంత్రులకు స‌రిగా ప‌నిచేయని మంత్రుల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. మంత్రుల ప‌నితీరును బ‌ట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. వారిలో మొద‌టి ర్యాంకులు, చివ‌రి నాలుగు ర్యాంకులు ప్ర‌క‌టించి, ర్యాంకులు రాని మినిస్ట‌ర్స్‌పై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. మంచి ర్యాంకులు సాధించిన మంత్రుల‌ను అభినందించారు. సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు మొదటి ర్యాంకులో ఉన్న‌ట్లు తెలిసింది. ఆయన శాఖ అధికారులతో బాగా పనిచేయిస్తున్నారని ఫ‌స్ట్‌ ర్యాంకు ఇచ్చారట. హోం మంత్రి చినరాజప్ప, ఇందనశాఖ మంత్రి కళా వెంకటరావు, పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌ రెడ్డిలకు ఆ తర్వాత ర్యాంకులు వచ్చాయి. నిజానికి విద్యుత్, శాంతి భద్రతలు, పరిశ్రమలు వ్యవహారాలను చంద్రబాబే ఎక్కువగా పర్యవేక్షిస్తుంటారని చెబుతారు. కాగా చివరి ర్యాంకులు వచ్చినవారిలో కొల్లురవీంద్ర, శిద్దా రాఘవరావు, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణలు ఉన్నారు. వారిని సీఎం మందలించారు. పైగా మంత్రులు పని తీరు సరిగా లేకపోతే తాను పదవి నుంచి తొలగించడమే కాకుండా, వచ్చే ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడం కూడా కష్టమేనని హెచ్చరించిన‌ట్లు తెలిసింది.

Add Comment